
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#klrahul
#jaspritbumrah
#cricket
1975లో మొదటి ప్రపంచకప్ జరిగింది. లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. వెస్టిండీస్ విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు 11 ప్రపంచకప్‌లు జరిగాయి. మే 30 నుండి జరిగే ప్రపంచకప్ 12వది. ఈ 42 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో ఎన్నో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. అయితే కొందరు ఆటగాళ్లు తమ అద్భుత ఆటతో ఇన్నింగ్స్‌నే మలుపు తిప్పారు. కొన్ని జట్ల కెప్టెన్లు తమ అనూహ్య నిర్ణయాలతో ఆటగాళ్ల ప్రతిభను వెలికి తీశారు.
1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలలో జరిగింది. న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. న్యూజీలాండ్ కెప్టెన్ మార్టిన్ క్రూ రెండు సర్ప్రైజ్ లు ఇచాడు. మార్క్ గ్రేట్బ్యాచ్ ను ఓపెనర్ గా పంపాడు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ దీపక్ పాటిల్ తో తొలి ఓవర్ వేయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ రెండు అనూహ్య నిర్ణయాలతో క్రూ తన జట్టుని సెమీ ఫైనల్ చేర్చాడు.
1996 ప్రపంచకప్‌కు పాకిస్థాన్, భారత్ దేశాలు ఆతిధ్యం ఇచ్చాయి. శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ ఈ టోర్నీలో ఓ సంచలన నిర్ణయం తీసుకుని కప్ సాధించాడు. సనత్ జయసూర్యకు తోడు వికెట్ కీపర్ రొమేష్ కలువితరణను ఓపెనర్ గా పంపి తన నిర్ణయం సరైందే అని నిరూపించాడు. 1999 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు మైఖేల్ బేవాన్ ను మంచి ఫినిషర్ గా గుర్తించింది. లోయర్ ఆర్డర్ లో బేవాన్ పరుగులు చేస్తుండంతో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి కప్ సాధించారు. ఇక 2007 ప్రపంచకప్‌లో ఆసీస్ స్టార్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 149 పరుగులు చేసి భారీ స్కోర్ అందించాడు. తన కీపింగ్ తోనే కాకుండా బ్యాట్ తో మెరిసి కప్ అందించాడు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
0 Comments